NewsWaves.news

జరిగింది చాలు.. యుద్ధం చేద్దాం : క్రికెటర్ గౌతమ్ గంభీర్

నిన్న పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడి పై టీమిండియా స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటి వరకు జరిగింది చాలని, పాకిస్తాన్ తో, కాశ్మీర్ లోని వేర్పాటువాదులతో భారత్ యుద్ధానికి పూనుకోవాలని గంభీర్ అభిప్రాయపడ్డారు.

ఉగ్రదాడి పై ట్విట్టర్లో స్పందించిన గౌతమ్ గంభీర్… ” ఇక జరిగింది చాలు.. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్ తో మాట్లాడాలి.. కానీ ఈ మాటలు గదుల్లో కాకుండా యుద్ధ మైదానంలో జరగాలి” అంటూ ఆవేశంగా ట్వీట్ చేశారు. పాకిస్థాన్ పై, పాక్ వేర్పాటు వాదులపై గంభీర్ ఫైర్ అవడం ఇది మొదటిసారి కాదు. భారత్ పై, భారత సైన్యంపై దాడి జరిగిన ప్రతిసారి పాకిస్థాన్ పై నిప్పులు చెరుగుతారు ఈ టీంఇండియా మాజీ ఓపెనర్.

Related Articles