NewsWaves.news

టీటీడీ 9 సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు…

టీటీడీ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టిడిపి చెందినటువంటి 9 సంస్థలు ఒకే రోజులో ఐఎస్ఓ గుర్తింపును పొందాయి. అత్యంత పరిశుభ్రంగా అలాగే ఆధునికంగా అందుబాటులో ఉండేటువంటి సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపును ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఐఎస్ఓ సంస్థ టీటీడీకి చెందిన తొమ్మిది సంస్థలకు గుర్తింపును ఇవ్వడంతో టీటీడీ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ఆ తొమ్మిది సంస్థలలో తిరుపతిలోని మాధవం యాత్రికుల వసతి సముదాయంతోపాటు శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల,శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, కుప్పం, రాజాం, నర్సాపురం, మహబూబ్నగర్, బెంగుళూరులలో గల టీటీడీ కల్యాణ మండపాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించడం జరిగింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి