NewsWaves.news

మళ్లీ పాత దారిలోకి త్రివిక్రమ్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అంటే చాలు ఆయన నుండి ప్రేక్షకులు కోరుకునేది పంచ్ డైలాగ్స్ అలాగే కామెడి.సాధారణంగా అజ్ఞాతవాసి సినిమా కంటే ముందు వరకు త్రివిక్రమ్ తీసిన అన్ని సినిమాల్లోనూ దీనికి కొదవలేదు. కానీ అజ్ఞాతవాసి దాని తర్వాత వచ్చిన అరవింద సమేత సినిమాల్లో కామెడీ పెద్దగా లేకపోవడం ఆ సినిమాల కలెక్షన్ల పైన బాగానే ప్రభావం చూపించింది.

అయితే ఈ విషయాన్ని గమనించిన త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీతో చేయనున్న చిత్రంలో ఆ లోటు లేకుండా జాగ్రత్త పడుతున్నారట. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రారంభం కానున్న ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి చేశాడు త్రివిక్రమ్. ఇక మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్ ప్లే ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగే లాగా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.




Related Articles