NewsWaves.news

పాకిస్తాన్‌లో నన్ను బాగా చూసుకుంటున్నారు : పాక్ అదుపులో ఉన్న పైల‌ట్ అభినంద‌న్‌

పాకిస్తాన్ అదుపులో ఉన్న భార‌తీయ పైల‌ట్‌, లెఫ్ట‌నెంట్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్‌కు సంబంధించిన ఒక వీడియోను పాకిస్తాన్ విడుద‌ల చేసింది. ఈ వీడియోలో అభినంద‌న్ టీ తాగుతూ పాకిస్తాన్ మేజ‌ర్ అడిగిన ప్రశ్న‌ల‌కు స‌మాధానం చెబుతున్నాడు. భార‌త్‌లో ప్ర‌వేశించిన పాక్ విమానాల‌ను త‌రిమికొట్టే క్ర‌మంలో భార‌తీయ సైనిక విమానాలు పాక్‌లోకి ఎంట‌ర్ అవ్వగా ఒక విమానం పాక్‌లో కుప్ప‌కూలింది. అందులో ఉన్న అభినంద‌న్‌ను పాక్ అర్మీ అదుపులో తీసుకుంది. అనంత‌రం అత‌నికి ప్రాధ‌మిక చికిత్స చేసి.. ఒక వీడియో షేర్ చేసింది.

అందులో అభినంద‌న్ త‌న ప‌రిస్థితి గురించి వివ‌రించారు. త‌ను క్షేమంగా ఉన్నాన‌ని.. పాకిస్తాన్ సైనికులు త‌న‌ను బాగా చూసుకుంటున్నార‌ని తెలిపిన అభినంద‌న్‌..సెక్యూరిటీకి సంబంధించిన విష‌యాలు వెల్ల‌డించ‌న‌ని చెప్పారు.
ఆ వీడియో చూడండి

అభినంద‌న్ వర్థ‌మాన్ గురించి

*అభినంద‌న్ కేర‌ళ‌కు చెందిన తాంబరంలో ఉన్న ఐఎఎస్ అకాడ‌మీలో అభినంద‌న్ విధులు నిర్వ‌హిన్నాడు.

*అభినందన్ తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్.

*అభినందన్ అనే ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ తమ బందీగా ఉన్నాడని పాక్ ఓ వీడియోను విడుదల చేసిన తర్వాత డిలీట్ చేసింది.

*ఆ వీడియోలో ఉన్న వ్యక్తి తాను అభినందన్‌ అని చెప్పారు. తాను పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్నానా అని ప్రశ్నించాడు.నీ అవతలి వైపు నుండి సమాధానం రాలేదు.

Related Articles