NewsWaves.news

దేశానికి కొత్త ఆర్థిక విధానం కావాలి : కేసీఆర్‌

దేశం అన్ని రంగాల్లో ముందుండాలంటే స‌రికొత్త ఆర్థిక విధానం కావాల‌న్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ . దీని కోసం రాష్ట్రాల‌ను ఆర్థికంగా ప‌రిపుష్టి చేయాల‌ని.. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. అప్పుడే భార‌త‌దేశం ప్ర‌పంచ ప‌టంలో టాప్ కు చేరుతుంద‌న్నారు. ప్ర‌పంచంలో ఒక ఆర్థిక శ‌క్తిగా ఎద‌గ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని వ‌న‌రులున్న భార‌త‌దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం కావాల‌ని..దీని కోసం కేంద్రం రాష్ర్టాలకు మరింత అవకాశం ఇవ్వాలన్నారు కేసీఆర్‌. 15వ ఆర్థిక సంఘం ప్ర‌తినిధి బృందంతో స‌మావేశ‌మైన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ మేర‌కు ఆర్థిక సంఘం చైర్మ‌న్ ఎన్‌కే సింగ్‌కు స‌లహాలు, సూచ‌న‌ల‌తో కూడిన విన‌తీ ప‌త్రాన్ని అందించారు.

Related Articles