NewsWaves.news

పుల్వామా కిరాత‌కంపై సినీప్రముఖుల ఆవేద‌న‌

      పుల్వామాలో   ఉగ్ర‌వాదుల కిరాత‌క చ‌ర్య‌పై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆవేద‌న వ్య‌క్తంచేశారు. వీరమరణం పొందిన జవాన్లకు ప్ర‌గాఢ  సంతాపం తెలిపారు.

  • ఉగ్ర‌వాదుల దాడిలో  ప్రాణాలు కోల్పోయిన  జవాన్ల కుటుంబాలకు  నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- మహేశ్‌బాబు
  • జ‌వాను కుటుంబ‌స‌భ్యుల‌కు మనస్ఫూర్తిగా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రతి జవాను త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. చాలా చాలా బాధాకరమైన రోజు’- అల్లు అర్జున్
  • దాడి జ‌రిగిన వార్త విని షాక‌య్యాను. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ల కుటుంబాలు ధైర్యంగా ఉండాలి….రానా ద‌గ్గుబాటి
  • దాడి చేసింది చాలక సిగ్గులేకుండా మేమే చేశామంటూ జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ చెప్పుకుంటోంది. ఈ రాక్షసులకు మానవత్వమనేదే ఉండదు. పాకిస్థాన్‌లో ఇలాంటి ఉగ్ర సంస్థలకు రక్షణ ఎలా కల్పిస్తున్నారు?…- స్వరా భాస్కర్‌
  • ఎందరో జవాన్ల ప్రాణాలు తీసి, వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిన వారిని క్షమించకూడదు. ఈ నష్టాన్ని తట్టుకునే శక్తి వారి కుటుంబాలకు ప్రసాదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వారి కోసం ప్రతి భారతీయుడు ప్రార్థిస్తుంటాడు. జై హింద్‌- ….   సోనూ సూద్
  • ఎంత దారుణం.. ప్రేమికుల రోజు జరుపుకొంటున్న వేళ ద్వేషం తలెత్తింది. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి- అభిషేక్‌ బచ్చన్‌‌

Related Articles