NewsWaves.news

పాకిస్తాన్ న‌శించాలంటూ రోడ్డుపై పెయింటింగ్‌

పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్‌పై అంత‌ర్జాతీయంగా ఎన్నో దేశాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా ఆ దేశానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన వినోద్ అనే ఆర్టిస్ట్ త‌న క‌ళ‌తో నిర‌స‌న తెలిపాడు. రాయ్‌పూర్‌లోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో హైవేపై పాక్తిస్తాన్ జెండా పెయింట్‌గా వేసి పాకిస్తాన్ నశించాలంటూ రాశాడు. ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న పాకిస్తాన్ అంతం అయిపోవాలంటూ ఇలా క‌ళ‌తో వినూత్నంగా నిర‌స‌న తెలిపాడు వినోద్‌.

Related Articles