NewsWaves.news

త్రివిధ దళాల సెల‌వులు ర‌ద్దు

లైన్ ఆఫ్ కంట్రోల్‌లో భార‌తీయ వాయుసేన నిర్వ‌హించిన మెరుపు దాడిని దృష్టిలో ఉంచుకుని.. త్రివిధ ద‌ళాల సెల‌వుల‌ను ర‌ద్దు చేసింది భార‌త ప్ర‌భుత్వం. పుల్వామా దాడికి ప్ర‌తీ కారంగా నిర్వ‌హించిన ఈ దాడిలో జైషే మ‌హ్మ‌ద్ సంస్థ‌కు చెందిన ప‌లు ఉగ్ర‌స్థావ‌రాలు ధ్వంసం అయ్యాయి..దీని కోసం సుమారు 1000 కిలోల బాంబులు జార‌విడిచాయి మ‌న సైనిక విమానాలు.

ఈ దాడి త‌రువాత పాకిస్తాన్ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. భార‌త్ చ‌ర్య‌ల‌కు ప్ర‌తి చ‌ర్య‌ల గురించి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. పాకిస్తాన్ ప్ర‌తికార దాడుల‌కు దిగే అవకాశం ఉన్నందువ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దీంతో తీర ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Related Articles