NewsWaves.news

ఆ 21 నిమిషాలు.. పాక్ కు చుక్క‌లు క‌నిపించాయి

పాక్ కు భార‌త్ చుక్క‌లు చూపించింది. అర్థ‌రాత్రి ఎల్ ఓ సీ లో భార‌త్ వైమానిక దాడుల గురించి తెలుసుకున్న పాక్ రియాక్ట్ అవ్వ‌డానికి అస‌లు టైమ్ స‌రిపోలేదు. అది రియాక్ట్ అయ్యే స‌మయానికి… భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్‌ 2000 జెట్‌ ఫైటర్లు… ప‌ని పూర్తి చేసుకున్నాయి.

పుల్వామా దాడి త‌ర్వాత పాకిస్తాన్‌కు భార‌త్ ఇచ్చిన షాక్ నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. కేవ‌లం 21 నిమిషాల్లోనే దాడులు పూర్తి చేసుని మ‌న మిరాజ్ విమానాలు తిరిగిరాగా….ఈ దాడిలో జైషే మ‌హ్మ‌ద్‌కు చెందిన ఎన్నో ఉగ్ర‌వాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో జైషే మ‌హ్మ‌ద్‌కు చెందిన ఆల్పా-3 కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసం అయింది.

Related Articles