NewsWaves.news

రెండో వ‌న్డేలోనూ భార‌త్ విజ‌యం

కివీస్‌పై భార‌త్ మ‌రో విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంది. ఐదు వ‌న్డేల సిరీస్‌తో భాగంగా ఈ రోజు జ‌రిగిన రెండో వ‌న్డేల్లో కివీస్ను 40 ఓవ‌ర్ల‌లో 234 ప‌రుగులుకే ఆలౌట్ చేసి 90 ప‌రుగుల‌తో భారీ విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంది టీమ్ ఇండియా. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసిన భారత్‌ భారీ విజయం నమోదు చేసింది. ఫలితంగా సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్స్‌లో 324 భారీ ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ టీమ్‌కు ఇచ్చింది. రోహిత్ శ‌ర్మ (87), ధావ‌న్ (66), కోహ్లీ (43), రాయుడు (47), ధోనీ (33), జాద‌వ్ (22) చ‌క్క‌గా బ్యాటింగ్ చేయ‌డంతో కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి టీమ్ ఇండియా మంచి స్కోర్ చేయ‌గ‌లిగింది. భార‌త్ ఇచ్చిన టార్గెట్‌ను ఛేజ్ చేయ‌డానికి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ టీమ్ మొద‌టి నుంచే త‌డబ‌డింది ఒక్క బ్రాస్‌బెల్ (57; 46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మిన‌హా మిగితా బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ రాణించ‌క‌పోవ‌డంతో భార‌త్ సులువుగా విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

Related Articles