NewsWaves.news

అందుకే మిరాజ్‌తో దాడులు చేయాల్సి వ‌చ్చింది : గోఖ‌లే

భార‌త్ వాయుసేన మెరుపు దాడి నేప‌థ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడారు. జైషే మ‌హ్మ‌ద్ మ‌రిన్ని మెరుపు దాడులు నిర్వ‌హించేందుకు ప్లాన్ చేయ‌నున్న‌ద‌ని తెలిసింద‌ని.. వాటిని నివారించేందుకే తెల్లవారుజామున బాలాకోట్లో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై వైమానిక దాడి చేసినట్లు పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

  • ఖ‌చ్చిత‌మైన స‌మాచారంతోనే ఈ దాడి చేసిన‌ట్టు తెలిపారు.
  • పుల్వామా దాడిలో జైషే మ‌హ్మ‌ద్ సంస్థ హ‌స్తం ఉంద‌ని.. పాకిస్థాన్‌ను చ‌ర్య‌లు తీసుకోమ‌ని కోరినా..స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డం వ‌ల్లే వైమానిక దాడులకు దిగామని చెప్పారు.
  • ఈ వైమానిక దాడిలో భారీ సంఖ్య‌లో ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్టుగా తెలిపారు.
  • పీఓకేలో వంద‌లాది ఉగ్ర‌వాద స్థావరాలు ఇంకా ఉన్న‌ట్టు తెలిపారు.
  • మసూద్ అజార్ బావ మరిది యూసుఫ్ అజహర్ టార్గెట్ గా ఈ దాడులు నిర్వహించినట్టుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

Related Articles