NewsWaves.news

పాకిస్తాన్ ఎదురు దాడికి దిగితే ?

ప్ర‌తీకారం తీరింది. పుల్వామా దాడికి ప్ర‌తి దాడిగా వాయుసేన రంగంలోకి దిగి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి వెళ్లి ప్ర‌తీకారం తీర్చుకుంది. జైషే మొహ‌మ్మ‌ద్‌, ల‌ష్క‌ర్‌, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ స్థావ‌రాల‌పై బాంబులు వేసి వంద‌ల‌ మంది ఉగ్ర‌వాదుల‌ను హత‌మార్చింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయ‌నుంది అనేది పెద్ద ప్ర‌శ్న‌. అయితే పాకిస్తాన్ ఏం చేసినా దాన్ని తిప్పికొట్టి త‌గిన గుణ‌పాఠం చెప్పే స‌త్తా భార‌త దేశానికి ఉంది. దాడికి దిగితే పాకిస్తాన్ ఎంత స‌మ‌యంలో తోక‌ముడుస్తుంది అనేదే పెద్ద ప్ర‌శ్న‌. పాకిస్తాన్ ఎదురు దాడి చేస్తే… ఎదుర్కొని తిప్పి కొట్ట‌డానికి భార‌త్ ఎలా స‌న్న‌ద్ధం అవుతోందో చూద్దాం

  • ఇప్ప‌టికే ఈ దాడిని పాకిస్తాన్ ఒక అవ‌మానంగా భావించి అక్కడి ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు రాకముందే భార‌త్‌పై ఎదురు దాడి చేయాల‌ని భావిస్తోద‌ని స‌మాచారం. ఇలాంటి స‌మ‌యంలో భార‌త్ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది.
  • ముందుగా త్రివిధ ద‌ళాలకు సెల‌వుల‌ను ర‌ద్దు చేసింది. ప్ర‌తీ సైనికుడు ఇప్పుడు కేటాయించిన పాయింట్‌కు చేరుకొని ఉన్న‌తాధికారుల ఆదేశాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. సిగ్న‌ల్ అంద‌గానే దాడి చేయ‌డానికి సిద్ధం గా ఉంటారు.
  • ఇండియ్ ఎయిర్ ఫోర్స్ హై అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. దాంతో పాటు పాకిస్తాన్‌తో స‌రిహ‌ద్దును షేర్ చేసుకునే గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్‌ను సిద్ధం చేసుకుంది.
    *పాకిస్తాన్ ఆర్మీ, నేవి, మిలటరీ నుంచి ఎలాంటి ప్రతిదాడి వచ్చినా దానిని ఎదుర్కోనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు త్రివిధ దళాలు ప్రకటించాయి. అరేబియా సముద్రంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
    *ఎయిర్‌బేస్‌లు, నావల్ కమాండ్‌, మిలటరీ బెటాలియన్లను ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా రక్షణ శాఖ అప్రమత్తం చేసింది.

Related Articles