NewsWaves.news

భార‌త్ ఇప్పుడు ఒక అంత‌రిక్ష శ‌క్తి : ప‌్ర‌ధాని మోదీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అ రోజు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు కొద్దిసేపటిక్రితమే యాంటి శాటిలైట్‌ ఏ శ్యాట్‌ ద్వారా ఎల్‌ఈఓ(లోయర్‌ బెర్త్‌ ఆర్బిట్‌) ఉపగ్రహాన్ని నేలకూల్చారు. ఈ విజ‌యంపై ప్రధాని మోది ఇవాళ జాతి నుద్దేశించి సందేశాన్నిచ్చారు. ఇది అత్యంత కఠినమైన చర్య అని కేవలం మూడు నిమిషాల్లోనే ఆ ఉపగ్రహాన్ని పేల్చివేశారని, మన శాస్త్రవేత్తలు ప్రపంచానికే గర్వకారణం అని ఆయన అన్నారు. ఈ ఘటన సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులో చోటుచేసుకున్నది. శాస్త్రవేత్తలు దీనిని సమర్ధవంతంగా పూర్తిచేశారని, డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలకు మోది కృతజ్ఞతలు తెలిపారు.


యాంటి శాటిలైట్‌ దేశానికి బలం చేకూర్చుతుందని, అంతరిక్షం ఇప్పుడు మానవ జీవితంలో ఒక భాగమైందని, ఆధునిక టెక్నాలజీని దేశ ప్రజలు సురక్షితం కోసం వాడుతున్నారని, సురక్షితమైన, సమృద్ధియైన, శాంతిపూర్వక దేశాన్ని నిర్మిస్తామని గర్వంగా చెప్పారు. అమెరికా, రష్యా, చైనా సరసన ఇప్పుడు మన దేశం నిలిచిందన్నారు. ఏదైనా లొకేషన్లపై శాటిలైట్‌ స్పై చేస్తే దాన్ని యాంటి శాటిలైట్‌తో పేలుస్తారు. లోయర్‌ ఆర్బిట్‌లో ఏదైనా ఉపగ్రహం సంచరిస్తే, దాన్ని ఇప్పుడు ఇండియా పేల్చేయగలదు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి