NewsWaves.news

పాకిస్తాన్ పై భారత్ బాంబుల వర్షం…

భారత్ అన్నంత పనీ చేసింది. పుల్వామ ఉగ్రవాద దాడి అనంతరం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈరోజ తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాల ప్రాంతంలో వెయ్యి కిలోల బరువైన బాంబులను పాక్ భూభాగంలోని టెర్రరిస్టు క్యాంపులపై భారత వాయుసేన ప్రయోగించింది.

మిరాజ్ 2000 ఫైటర్ జెట్ ల సహాయంతో ఉగ్రవాద క్యాంపులపై బాంబులు కురిపించింది భారత్ వాయు సేన. ఈ దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాద క్యాంపులు భారీగా ధ్వంసమైన ట్లు తెలుస్తోంది. మొత్తం 12 ఫైటర్ జెట్లను ఈ దాడికి ఉపయోగించారు.ఎల్ఓసీ సమీపంలోని బాలాకోట్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులకు శిక్షణను ఇస్తూ ఉంటాయి.

అందుకే భారత్ బాలాకోట్ ని టార్గెట్ గా ఎంచుకుంది.భారత వాయుసేన జరిపిన ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. భారత్ దాడిని పాకిస్థాన్ కూడా ధ్రువీకరించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది పాక్ ప్రభుత్వం అలాగే అక్కడి మీడియా.



Related Articles