NewsWaves.news

యుద్ధం వ‌స్తే..మేము వెన‌క్కి త‌గ్గం..కానీ ముందు మాట్లాడ‌దాం : ఇమ్రాన్ ఖాన్‌

పుల్వామా దాడిపై పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించాడు. ఉగ్ర‌దాడికి పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. ఎలాంటి ఆధారాలు లేకుండా భార‌త్ పాకిస్తాన్‌ను నిందిస్తోందన్నాడు. పుల్వామా ఉగ్ర‌దాడి జరిగాకా.. ఇప్ప‌టిదాకా ఏం మాట్లాడ‌ని ఇమ్రాన్ ఖాన్…తొలిసారి ఈ దాడిపై స్పందించారు. ఇండియా వ‌ద్ద పుల్వామా దాడి కి పాకిస్తానే కార‌ణం అని నిరూపించే ఆధారాలు ఉంటే చూపించాల‌ని..వాటిని ఆధారంగా చేసుకుని చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నాడు.

పాకిస్తాన్ ఉగ్ర‌వాదాన్ని అంతంచేసే దిశ‌గా ప‌ని చేస్తోంద‌ని.. అభివృద్ధి వైపు ప‌య‌నిస్తోంద‌ని..శాంతి కోరుకుంటోంద‌న్నాడు. పుల్వామా దాడిపై ద‌ర్యాప్తు చేయాల‌ని అనుకుంటే దానికి స‌హ‌క‌రిస్తామ‌ని అన్నాడు. అలా కాకుండా యుద్దం చేయాల‌నుకుంటే మాత్రం దానికి కూడా సిద్ధం అన్నాడు ఇమ్రాన్.

Related Articles