NewsWaves.news

మోడీ గారూ…ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీస్‌: పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌

నిన్నా మొన్న‌టి దాకా పొగ‌రుగా మాట్లాడిన పాక్ ప్ర‌ధాని ఒక మెట్టు దిగారు. పుల్వామా దాడి త‌ర్వాత అది చేసింది పాక్‌కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ అని చెప్పింది భార‌త్‌. అనంతరం దేశ ప్ర‌జ‌ల నుంచి దాడికి ప్ర‌తి దాడి చేయ‌మ‌ని డిమాండ్ పెర‌గ‌డంతో ప్ర‌ధాని మోదీ, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ‌నిచ్చారు. దీంతో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కూడా యుద్దానికి మేము కూడా రెడీ అన్న‌ట్టు మాట్లాడాడు. అయితే ఇటీవలే ప్ర‌ధాని మోదీ ఒక మాట‌న‌డంతో మ‌ళ్లీ ఒక అడుగు దిగాడు ఇమ్రాన్ ఖాన్‌..

‘ఇమ్రాన్‌.. పఠాన్‌ల కుమారుడిననీ, అబద్ధాలు చెప్పనన్నావ్‌’ ఆ మాటను నిలబెట్టుకుంటావా? అని భారత ప్రధాని విసిరిన సవాల్‌పై పాక్‌ ప్రధాని స్పందించారు. దీనికి రిప్లైగా… మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాను… పుల్వామాకు సంబంధించిన ఆధార‌లుంటే ఇవ్వండి చ‌ర్య‌లు తీసుకుంటాం. శాంతి కోసం ఒక అవ‌కాశం ఇవ్వండి అని ఇమ్రాన్ విజ్ఞ‌ప్తి చేశాడు. గ‌తంలో ఇమ్రాన్ ఖాన్ ప్ర‌ధానిగా ఎన్నికైన‌ప్పుడు ఇరుదేశాల్లో శాంతి నెల‌కోల్ప‌డానికి స‌హ‌క‌రిస్తాన‌ని ఇమ్రాన్ ఖాన్ మాట ఇచ్చాడు. ఆ మాట ఇమ్రాన్ ఖాన్ నిల‌బెట్టుకుంటాడో లేదో చూడాలి అని మోదీ తెలిపారు. దీనికి ఇమ్రాన్ ఇలా స్పందించారు..

Related Articles