NewsWaves.news

యుద్ధం వ‌స్తే రెండు దేశాల‌కు మంచిది కాదు : ఇమ్రాన్ ఖాన్‌

బాలాకోట్‌లో భార‌త వాయుసేన విమానాలు వెళ్లి దాడి చేసిన త‌ర్వాత భార‌త్- పాక్ మ‌ధ్య‌లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తాజా పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. స‌మ‌స్య‌ల‌ను కలిసి కూర్చొని మాట్లాడదాం.. శాంతియుత వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు కొన‌సాగిద్దాం. స‌హ‌నం కోల్పోతే ప‌రిస్థితులు వేరేలా ఉంటాయి. యుద్ధం ప్రారంభ‌మైతే అది ఎక్క‌డికి వెళ్తుందో తెలియ‌దు. అలా జ‌రిగితే ప‌రిస్థితులు మోదీ లేదా పాక్ అదుపులో ఉండ‌వు అన్నాడు ఇమ్రాన్‌. అదే స‌మ‌యంలో యుద్దం ఇరు దేశాల‌కు మంచిది కాద‌న్నాడు.

పుల్వామా దాడి వ‌ల్ల మీకు బాధ‌క‌లిగింది. మాక్కూడా బాధ క‌లిగింది. కానీ ఇందుకు యుద్ధం ప‌రిష్కారం కాదు. చ‌ర్చ‌ల‌తో ప‌రిష్కారం చేసుకోవ‌చ్చు. ఇక యుద్ధం విష‌యానికి వ‌స్తే మీ ద‌గ్గ‌ర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో.. మా ద‌గ్గ‌ర కూడా అలాంటివే ఉన్నాయని తెలిపాడు ఇమ్రాన్‌.

Related Articles