NewsWaves.news

దీపాల‌కు నవగ్రహాలకు ఉన్న సంబంధం

ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహాలను కొలిచి ఆయా గ్రహప్రభావ దోషాలను తొలగిస్తుంది .ఏ దేవునికైనా ప్రమిదలో దీపమెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. ప్రమిద,అందులోని నూనె ,వత్తులు , కాంతికి, నవగ్రహాలకు సంబంధం వుంది . ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు .ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని శాస్త్ర వచనం .

  1. ప్రమిద దీపం …సూర్యుడు
  2. నెయ్యి , నూనె- ద్రవపదార్థం ..చంద్రుడు .
  3. వత్తులు ..బుధుడు ..
  4. ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల .. అంగారకుడు .
  5. ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన రాహువును సూచిస్తుంది .
  6. జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు .
  7. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి సంకేతం
  8. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే కాంతి- ఇది జ్ఞానం .. కేతువుకు సంకేతం
  9. ప్రమిదలోని వత్తులు తరుగుతూ రావడానికి శుక్రుడు సంకేతం .శుక్రుడు ఆశకు కారకుడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది .

తమసోమా జ్యోతిర్గమయా .!
ఆశలతో మానవజన్మ సార్థకం కాదని , తద్వారా మోక్షం లభించడం కష్టమని , తిరిగి తిరిగి మానవుడు ఆశల ద్వారా కర్మలు చేసుకుంటూ పోతూ , విషయవాసనల చక్రంలో బందీ అవుతాడు .

కనుక కర్మలన్నియు భగవదర్పిదంగా చేయవలెనని “గీత” బోధిస్తుంది….

Related Articles