NewsWaves.news

ఈ సారి భారీ వర్షాలు : వాతావరణ శాఖ

వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సంవత్సరం 96% వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం సీనియర్ అధికారి వెల్లడించారు. 1951 వ సంవత్సరం నుండి 2000 సంవత్సరం వరకు నైరుతి రుతుపవనాలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం ఆధారంగా చేసుకుని చూస్తే ఈ సంవత్సరం 96% వర్షాలు పడతాయని అంచనా అధికారులు వేశారు .

దీంతో రైతులకు సానుకూల సంకేతాలు అందినట్లు అయింది. ఈ సంవత్సరం కరువు ఏర్పడే అవకాశాలు 17 శాతం లోపే అని పేర్కొనడం బట్టి చూస్తే భారీ వర్షాలు భారీగా ఉన్నాయని అర్థమవుతోంది. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం బలహీనంగానే ఉందని.. తెలుగు రాష్ట్రాల్లో జూన్-జూలై నెలల్లో కురిసే వర్షాలపై దీని ప్రభావం స్వల్పంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి