NewsWaves.news

మనం ఒక్క అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులు వేస్తుంది

భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్.. భారత్ పై ఒక్క అణుబాంబు వేస్తే… భారతదేశం పాక్ పై 20 అణుబాంబులను వేస్తుందని ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలా జరగకుండా ఉండాలంటే ‘మనం భారత్ పై 50 అణుబాంబులు వేయాలి.. అప్పుడు భారత్ పాకిస్థాన్ పై 20 అణుబాంబులతో దాడి చేయకుండా ఆగుతుంది. కానీ మీరు 50 అణు బాంబులతో దాడికి సిద్ధమేనా’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముషారఫ్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ముషారఫ్ అన్నారు.

Related Articles