NewsWaves.news

పాక్ అలా చేస్తే సాయం చేస్తాం…రాజ్ నాథ్

భారత్ లో మరోసారి కూడా ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయితే పాక్, భారత్ ల మధ్య శాంతి నెలకొనడానికి అవకాశం ఉంటుందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో ఇమ్రాన్,మోదీ స్నేహితుడు అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాయి. ఇక ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ స్పందించారు.పాక్ నుండి ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందిస్తామని ఆ దేశం ప్రకటిస్తే కనుక అందుకు కావాల్సిన సహాయాన్ని భారతదేశం కూడా అందిస్తుంది అని రాజ్ నాథ్ వెల్లడించారు.

దీనికి సంబంధించిన ప్రకటనను కూడా పాకిస్తాన్ చేస్తే అప్పుడు నిజంగానే ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని మోదీకి అభిమాని అని మేమందరం నమ్ముతాము అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాకుండా పాకిస్తాన్ భారతదేశంతో సత్సంబంధాలను కోరుకుంటుంది అనే విషయాన్ని కూడా తాము అంగీకరిస్తామని ఆయన తెలిపారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి