NewsWaves.news

జ‌మ్ముకశ్మీర్‌లో ఉగ్ర‌దాడి: 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి

జ‌మ్ముక‌శ్మీర్‌లోని పుల‌వామా జిల్లాలో ఉగ్ర‌వాదులు ఐఈడి బాంబులు పేల్చ‌డంతో 18 మంది సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్ ) సిబ్బంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 13 మంది గాయ‌ప‌డ్డారు. జిల్లాలో అవంతిపురాలో జ‌రిగిన పేలుళ్ల త‌రువాత తుపాకి చ‌ప్పుళ్లు కూడా వినిపించాయ‌ని స్థానికులు తెలిపారు. తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో బాంబు దాడికి జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్నవాహ‌నం ధ్వంసం అయింది. అయితే ఈ పేలుడుకు త‌మ‌ ప‌నేనంటూ జైషే మ‌హ్మ‌ద్ అనే ఉగ్ర‌వాద సంస్థ ఒప్పుకుంది. ఈ ఘట‌న త‌ర్వాత అవంతిపుర‌లో సెక్యూరిటీ సిబ్బంది కూంబింగ్ నిర్వ‌హించారు.

Related Articles