NewsWaves.news

డ‌బ్బు ఇస్తానంటే ప్ర‌ధాని తీసుకోవ‌డం లేదు : విజ‌య్ మాల్యా

బ్యాంకుల ద‌గ్గ‌ర తీసుకున్న‌ డబ్బు తాను తిరిగి చెల్లించ‌డానికి స‌ద్ధంగా ఉన్నాన‌న్నాడు ఆర్తిక నేరస్థుడిగా మారిన మాజీ బిజినెస్ టైకూన్ విజ‌య్ మాల్యా. డ‌బ్బు ఇవ్వ‌డానికి రెడీ ఉన్నాన‌ని చెబుతున్నా…. దానికి సంబంధించిన ఆదేశాలు ప్ర‌ధాని ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ఎదురుదాడికి దిగాడు మాల్యా. లోక్ స‌భలో నరేంద్ర మోదీ విజ‌య మాల్యా గురించి ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. దీంతో మాల్యా ఇలా ట్వీట్ చేశాడు.

నా పేరు తీసుకోకుండానే 9 వేల కోట్లు ఎగ్గొట్టి వెళ్లిపోయాన‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. అయితే నేను అప్పు తీర్చ‌డానికి రెడీ గా ఉంటే.. తీసుకోమ‌ని బ్యాంకుల‌కు ఎందుకు చెప్ప‌డం లేదు మోదీగారు. అలా చేస్తే ఆయ‌న‌కు మంచి పేరు వ‌స్తుంది క‌దా.

అదే స‌మ‌యంలో నేను క‌ర్ణాట‌క కోర్టు ముందు వ‌చ్చి కింగ్ ఫిష‌ర్ కు సంబంధించిన అప్పులు.. ఇత‌ర వ్య‌వ‌హ‌రాలు అన్నీక్లియ‌ర్ చేస్తాన‌ని..చ‌ట్టం అంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని చెబుతోంటే.. ప్ర‌భుత్వ‌మే ఈ అంశాన్ని అంత‌గా సిరియ‌స్ గా తీసుకోవ‌డం లేద‌న్నాడు మాల్యా.

Related Articles