NewsWaves.news

అనంతపురంలో ఓడిపోతాను… పవన్

తనను గెలిపిస్తానన్న భరోసాని అనంతపురం ప్రజలు తనకు ఇవ్వలేదని, అందుకనే అక్కడి నుంచి పోటీ చేయలేదని, పోటీచేస్తే ఓడిపోతానన్న ఉద్దేశంతోనే అనంతపురం టికెట్ టీసీ వరుణ్ కు ఇచ్చానని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనుక తాను ఎన్నికలలో పోటీ చేస్తే అపజయాన్ని చవిచూడాల్సి వస్తుందని, సర్వేలు కూడా ఈ విషయాన్నే వెల్లడించాయని పవన్ అన్నారు. అలాగే భయపడే వారికి, ధైర్యంలేని వారికి జనసేనలో చోటు లేదని, అలాంటి నేతలు పార్టీకి అవసరం లేదని, ఒక మార్పు జరగాలి అంటే గొడవలకు కూడా సిద్ధపడాలని, అప్పుడే మార్పు జరుగుతుందని పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి