NewsWaves.news

చ‌స్తే స్వర్గానికి వెళ్తా : పుల్వామా దాడికి ముందు ఉగ్ర‌వాది వీడియో

నిన్న పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడి జ‌రిగిన వెంట‌నే ఆ దాడి చేసిన ఉగ్ర‌వాది ఫొటోలు వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఒక వీడియోలో చ‌నిపోయాక స్వర్గానికి వెళ్ల‌నున్న‌ట్టు తెలిపాడు ఆ టెర్ర‌రిస్ట్ గురువారం పుల్వామా జిల్లా అవంతిపోరాలో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని ఒక ఎస్‌యూవీ వ‌చ్చి ఢీకొంది.

ఈ వాహ‌నాన్ని జైషే మ‌హ్మ‌ద్ సంస్థ‌కు చెందిన తీవ్ర‌వారి ఆదిల్ ఆహ్మ‌ద్ దార్ న‌డిపాడు. వాహ‌నంతో డీకొట్టిన త‌ర్వాత ఆదిల్ వెంట‌నే ఆత్మ‌హుతికి పాల్ప‌డ్డాడు. దీంతో 44 మంది భార‌త జ‌వాన్లు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ఈ దాడి జ‌రిగిన వెంట‌నే ఇది త‌మ ప‌నేనంటూ జైషే మ‌హ్మ‌ద్ అనే ఉగ్ర‌వాద‌ సంస్థ ప్ర‌క‌టించుకుంది.

Related Articles