NewsWaves.news

ప్రజల్లో మోడీ పట్ల ఉన్న హవా వల్లే నేను ఓడాను… వినోద్

తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ నుండి పోటీ చేసిన వినోద్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.అయితే దేశవ్యాప్తంగా ఉన్న మోదీ హవా వల్లే తాను కరీంనగర్ లో ఓటమి పాలయ్యానని అన్నారు మాజీ ఎంపీ వినోద్. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తానని తెలిపారు.మోడీనే మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోవాలి అంటూ బిజెపి పార్టీ చేసిన ప్రచారం ప్రజలను విపరీతంగా ఆకట్టుకుందని,

ఇందిరా గాంధీ తర్వాత మళ్లీ అంతటి హవా నరేంద్ర మోడీకి వచ్చిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా పుల్వామ వంటి ఘటనలు ప్రజల్లో జాతీయ వాదాన్ని మేల్కొల్పాయని వెల్లడించారు. అయితే రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ అవలంబించే విధానాల పైన తాను స్పందిస్తానని తెలిపిన వినోద్… బిజెపి హయాంలో ఉన్న అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలను ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి