NewsWaves.news

ప్రపంచ కప్ విజేతకి భారీ ప్రైజ్ మనీ

ఈనెలాఖరులో ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మొత్తం 10 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి.ఇంగ్లండ్ లోని వేల్స్ ప్రపంచ కప్ 2019 ప్రారంభ వేడుకలకు ముస్తాబవుతుంది. ఈసారి ఇంగ్లాండ్ భారత్ ఆస్ట్రేలియా జట్లు బలంగా కనిపిస్తున్నాయి. మిగతా జట్లను కూడా తక్కువగా అంచనా వేయలేం.

ఈసారి ప్రపంచ కప్ విజేత జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది.
విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు అత్యధికంగా నాలుగు మిలియన్‌ డాలర్ల నగదు బహుమతి లభించనుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.28 కోట్లకుపైగానే. అలాగే రన్నరప్‌కు రెండు మిలియన్‌ డాలర్లు(రూ.14 కోట్లకుపైగా), సెమీఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు(దాదాపు రూ.5కోట్లకుపైగా) అందుతాయి. లీగ్‌ దశలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు 40 వేల డాలర్ల చొప్పున విజేతలు గెలుచుకోనున్నారు.

ఇక లీగ్‌ దశలోనే నిష్క్రమించే ప్రతీ జట్టుకు లక్ష డాలర్లు నగదు నజరానా అందనుంది. మొత్తం 46 రోజుల సంగ్రామం మే 30 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి