NewsWaves.news

మీ ప్యాన్ కార్డు ఆధార్‌తో లింక్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి!!

ఈ ఆర్టికల్ చ‌దివే స‌మ‌యానికి మీరు ప్యాన్ కార్డును ఆధార్ ను లింక్ చేయ‌డానిక ప్ర‌య‌త్నించే ఉంటారు. అయితే ప్యాన్ తో ఆధార్ లింక్ అయిందో లేదా ఎలా చెక్ చేయాలో తెలియని వారికోస‌మే ఈ ఆర్టిక‌ల్. ప్యాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గ‌డువు (31 మార్చి 2019) తేదీ స‌మీపిస్తోండ‌టంతో చాలా మందికి ఈ లింకింగ్ విధానంపై ఎన్నో సందేహాలున్నాయి. అందుకే …

ఇలా చెక్ చేసి చూడండి.

  1. ముందుగా ఇంకం ట్యాక్స్ ఫైల్ఫై చేసే వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in లోకి లాగిన్ అవ్వండి.
  2. అక్క‌డ ‘Link Aadhaar’ అని క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇందులో స‌మాచారం నింపండి.

3.ఆదాయ ప‌న్ను శాఖ‌తో లింక్ కాని ప్యాన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం అయ్యాయో లేవో తెలుపుతూ ఒక మెసేజ్ క‌నిపిస్తుంది.

4.ఇప్ప‌టికే ఇంకం ట్యాక్స్ వెబ్‌సైట్‌తో ప్యాన్ కార్డు లింకైన వారు మీ యూజర్ఐడీ, పాస్ వ‌ర్డును ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వండి. డైర‌క్ట్‌గా లాగిన్ అవ్వొచ్చు.

4.. ఇప్పుడు ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లింక్ ఆధార్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.

5.అయితే ఇప్ప‌టికే మీ ఆధార్-ప్యాన్ లింకు అయిన‌ట్ట‌యితే ఆ విష‌యం నెక్ట్స్ పేజీలో తెలిసిపోతుంది.

ఎస్సెమ్మెస్ తో…

  1. ముందుగా 567678 లేదా 56161 నెంబ‌ర్ల‌కు ఒక SMS పంపించండి.
  2. పంపించాల్సిన ఫార్మెట్ : UIDPAN;12-డిజిట్ల ఆధార్ నెంబ‌ర్‌>;10-డిజిట్ల ప్యాన్ నెంబ‌ర్‌>

ఉదాహ‌ర‌ణ‌కు : UIDPAN 111122223333 AAAPA9999Q
ఇలా ఎస్సెమ్మెస్ చేశాక వెంట‌నే మీకు ఒక మెసేజ్ వ‌స్తుంది. దాంతో మీ ప్యాన్‌కార్డు- ఆధార్ అనుసంధానానికి సంబంధించిన స్టేట‌స్ తెలిసిపోతుంది.

Related Articles