NewsWaves.news

హిజ్రాల వీరంగం… పోలీసులపై దాడి…

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో హిజ్రాలు బీభత్సం సృష్టించారు. పలువురు వాహనదారుల పైన దాడి చేయడమే కాకుండా తరువాత పోలీస్ స్టేషన్ లో కూడా వీరంగం సృష్టించారు.ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న బస్ స్టాప్ లో కొన్ని కార్లను ఆపి, పలువురిపై హిజ్రాలు దాడి చేశారు.

వారిని తీవ్రంగా కొట్టి వాళ్ళ మెడలో ఉన్న బంగారు గొలుసులను, ఆభరణాలను అలాగే వారి పర్సులను లాక్కున్నారు.ఈ దాడిని అడ్డుకోవడానికి యత్నించిన వారిని కూడా తీవ్రంగా కొట్టారు. దీంతో భయంతో దాడికి గురైన వారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.అయినప్పటికీ హిజ్రాలు వారిని వెంటాడి పోలీస్ స్టేషన్లోనూ వాళ్ళ పై దాడి చేసి, అడ్డు వచ్చిన ముగ్గురు పోలీసులపై కూడా తీవ్రంగా దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో విధ్వంసం సృష్టించారు. ఏసీపీ గాంధీ నారాయణ పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు.

బూతులు తిడుతూ, అసభ్యంగా వ్యవహరిస్తూ,మితిమీరి ప్రవర్తిస్తూ, రణరంగం సృష్టించారు.ఈ సంఘటన అర్ధరాత్రి దాటిన తర్వాత జరగడంతో పోలీస్ స్టేషన్లో ఎక్కువగా స్టాఫ్ అందుబాటులో లేదు.దానికి తోడు హిజ్రాలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పరిస్థితి చేజారిపోయింది.ఈ విషయం తెలుసుకున్న ఉప్పల్ సిఐ వెంటనే స్టేషన్ కి వచ్చి బాధితులు అలాగే దాడికి గురైన కానిస్టేబుల్ల నుండి ఫిర్యాదు తీసుకుని, వారిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి పంపించారు.

బాధితులు హాస్పిటల్ వెళుతున్న సమయంలో కూడా హిజ్రాలు వారిని వెంబడించడం గమనార్హం. ఇలా దాదాపుగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు హిజ్రాల హంగామా కొనసాగింది.కాగా హిజ్రాల ఆగడాలు మితిమీరు తున్నాయని, పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రయాణికులను రకరకాల ఇబ్బందులు పడుతున్నారని, దాడులు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles