NewsWaves.news

ఎన్‌జీకే టీజ‌ర్ విడుద‌ల‌

త‌మిళ సూప‌ర్ స్టార్ సూర్య ఒక మంచి హిట్ కొట్టి చాలా కాలం అయింది. వ‌రుస‌గా ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సూర్య‌..ఎన్‌జికే (నంద గోపాల కృష్ణ‌) సినిమాపై ఎన్నోఅంచ‌నాలు పెట్టుకున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్‌లో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను యూనిట్ విడుద‌ల చేసింది. ప్రేమికుల రోజుల సంద‌ర్భంగా సూర్య అభిమానుల‌కు ఈ టీజ‌ర్ కానుక‌గా అందిస్తున్న‌టు తెలిపింది చిత్ర యూనిట్‌.

ఎన్‌జీకే మూవీని సెల్వ‌రాఘ‌వ‌న్ తెర‌కెక్కిస్తోండ‌గా.. ఇందులో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ వేసవిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related Articles