NewsWaves.news

118 ట్రైల‌ర్ రివ్యూ

  • తారాగణం : క‌ళ్యాణ్ రామ్‌, షాలిని పాండే, నివేదితా థామ‌స్‌, నాజ‌ర్‌, ప్ర‌భాస్ శీను
  • నిర్మాత : మ‌హేష్ ఎస్ కోనేరు
  • ద‌ర్శ‌క‌త్వం : వీసి గుహ‌న్‌
  • డైలాగ్స్ : మిర్చీ కిర‌ణ్‌
  • సంగీతం : శేఖ‌ర్ చంద్ర‌

క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్క‌తోన్న 118 సినిమా ట్రైల‌ర్ ఈ రోజు విడుద‌లైంది. ఒక నిమిషం 53 సెక్ల‌న్ల వ్య‌వ‌ధి ఉన్న ఈ ట్రైల‌ర్ ర‌క్తిక‌ట్టించే విధంగా ఉంది. సాంకేతికంగా ఎంతో రిచ్‌గా ఉంది. ఈ ట్రైల‌ర్ ను చూసి క‌లిగిన ఫీలింగ్స్ రివ్యూ రూపంలో…

1.ముందుగా క‌ళ్యాణ్ రామ్ లుక్ గురించి.. టెంప‌ర్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ .. ఇప్పుడు 118 లో క‌ళ్యాణ్ రామ్ లుక్ ఒకే విధంగా ఉంది.

2.న‌టన విష‌యానికి వ‌స్తే క‌ళ్యాణ్ రామ్ పూర్తిగా పాత్ర‌లోకి లీనం అయిపోయాడు అనిపిస్తోంది. కొన్ని సీన్స్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ హైలైట్‌. యాక్ష‌న్ సీన్స్ లో బాగా న‌టించాడు.

3. ట్రైల‌ర్ చూస్తోంటే ఈ మూవీ ఒక మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. ఇందులో షాలినీ పాండే క‌ళ్యాణ్ రామ్ ల‌వ‌ర్ అని..నివేదితా థామ‌స్ మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంద‌ని.. ఆ మ‌ర్డ‌ర్‌కు క‌ళ్యాణ్ రామ్ ఏదో విధంగా క‌నెక్ట్ అవుతాడ‌ని తెల‌స్తోంది.

4.నివేదితా థామ‌స్ క‌ల‌లో వ‌చ్చి మ‌ర్డర్ మిస్ట‌రీ ఛేజ్ చేయ‌డానికి క‌ళ్యాణ్ రామ్‌ను గైడ్ చేస్తుంద‌ని.. దీని కోసం క‌ళ్యాణ్ రామ్ రిస్కులు చేస్తాడ‌ని అనిపిస్తోంది.

5.అయితే 118 అనే టైటిల్ కి క‌థ‌కు లింకేంటో సినిమా చూస్తేనే తెలియ‌దు. బ‌హుశా కోటి నుంచి మెహ‌దీప‌ట్నం వెళ్లే 118 సిటీ సిటీ బ‌స్సుకు ఈ సినిమాకు ఏమైనా లింకు ఉందో ఏంటో .. సినిమా చూస్తే గానీ తెలియ‌దు.

Related Articles