NewsWaves.news

ప్ర‌భాక‌ర్ రెడ్డికి నాక‌న్నా ఎక్కువ ఓట్లు రావాలి : హ‌రీష్ రావు

లోక్‌ సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగాల‌ని, మెదక్‌ ఎంపీ టీఆర్ ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌ రెడ్డికి త‌న‌కన్నా ఎక్కువ ఓట్లు రావాల‌ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు కార్యకర్తలను కోరారు. సిద్ధిపేట‌లో శ‌నివారం జ‌రిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. దేశంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు.

సిద్ధిపేటకు ఎన్నికలకు కొత్త కాదని తెలిపారు. ప్రభాకర్‌ రెడ్డి కృషితో సిద్ధిపేట మీదుగా రెండు జాతీయ రహదారులే కాక జిల్లాకు పాస్‌పోర్టు ఆఫీస్‌, కేంద్రీయ విద్యాలయం మంజూరయ్యాయని పేర్కొన్నారు జిల్లాలో రైల్వే పనులు శ‌ర‌వేగంతో జరుగుతున్నాయని హ‌రీష్ రావు తెలిపారు. నర్సాపురంలో ఏప్రిల్‌ 3న జరిగే సీఎం కేసీఆర్‌ సభకు సిద్ధిపేట నుంచి 20 వేల మంది తరలిరావాలిని కార్యకర్తలకు ఆయ‌న‌ పిలుపునిచ్చారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి