NewsWaves.news

నాకు అసంతృప్తి లేదు : హరీష్ రావు


కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తనకు అసంతృప్తి లేదని టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు గారు అన్నారు. నేడు రాజ్ భవన్లో పదిమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు హరీష్ రావు అభినందనలు తెలిపారు.

టీఆరెస్ లో తాను క్రమశిక్షణ గల సైనికుడినని, కేసీఆర్‌ ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తానని హరీష్ స్పష్టం చేసారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తన మీద సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దని హరీష్ రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాలు, ప్రాంతాల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేశారని హరీష్ తెలిపారు.

Related Articles