NewsWaves.news

హ‌నుమ వీర “విహారం”- ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు

ఆంధ్ర యువ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి  ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇరానీకప్‌లో భాగంగా రెస్టాఫ్‌ ఇండియా తర‌ఫున ఆడుతున్న విహారి..రంజీ చాంపియన్‌ విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో వరుసగా రెండు సెంచరీలు రికార్డు చేశాడు.  తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన విహారి.. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం నమోదు చేశాడు. నాలుగో రోజు ఆటలో . విహారి సెంచరీతో మెరిశాడు.  

తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 180 పరుగులు సాధించాడు. గ‌త ఏడాది  విదర్భతో జరిగిన మ్యాచ్‌లో విహారి 183 పరుగులు సాధించాడు. 2011 తర్వాత ఒక ఇరానీకప్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌ కూడా విహారియే కావడం మరో విశేషం. ఆనాటి ఇరానీకప్‌లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున ఆడిన శిఖర్‌ ధావన్‌.. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల‌లో  రెండు సెంచరీలు సాధించాడు. తాజా ఇరానీకప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 374/3 వద్ద డిక్లేర్ చేసింది. విదర్భకు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

రెస్టాఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 330 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 374/3 డిక్లేర్డ్ 

Related Articles