NewsWaves.news

చంద్రబాబుకు రానున్నదంతా కష్టకాలం… జీవీఎల్

లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సింగల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు. మే 23 తర్వాత బాబు పాలిటిక్స్ లో ప్రాతినిధ్యాన్ని కోల్పోతారని ఆయన జోస్యం చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రతిపక్ష హోదా అయినా వస్తుందో రాదో అనే విషయం అనుమానమేనని వ్యాఖ్యానించారు.హస్తం పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక గాలులు వీస్తున్నాయని అన్నారు.

ఇక ఈ ఎన్నికల ఫలితాలలో బాబు పరాజయం పాలవుతారని,ఆ తర్వాత ఆయన అవినీతి చిట్టా బయట పడబోతోందని తెలిపారు.రానున్న కాలమంతా బాబుకు కష్టకాలం అని ఆయన పేర్కొన్నారు.మే 23వ తేదీన వెలువ డే ఫలితాలలో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో చంద్రబాబు మొత్తం అంతా అపఖ్యాతినే మూటగట్టుకున్నారని వ్యాఖ్యానించారు జివిఎల్.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి