NewsWaves.news

ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ బాబుని క‌లిసిన సినీ నిర్మాత‌

చిత్తూరు పార్ల‌మెంట్ స‌భ్యుడు శివ‌ప్ర‌సాద్ పెద్ద అల్లుడు గుంట‌టి వేణుగోపాల్ ఈ రోజు ఏపి సిఎం చంద్ర‌బాబును క‌లిశాడు. స‌త్య‌వేడు అసెంబ్లీలో టికెట్ ఆశిస్తూ చంద్ర‌బాబుతో భేటీ అయ్యాడు. సినీ నిర్మాత‌, వ్యాపారీ అని చెబుతూ త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకున్నాడు వేణుగోపాల్‌.

గ‌తంలో స‌త్య‌వేడు నియోజక వ‌ర్గంలో ఎన్నోసామాజిక కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్న‌ట్టు త‌న బ‌యోడాటాలో పేర్కొన్నాడు. అయితే ఇప్ప‌టికే శివ‌ప్ర‌సాద్ చిన్న‌ల్లుడికి రైల్వే కోడూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చిన చంద్ర‌బాబు, వేణుగోపాల్‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం త‌క్కువే.

Related Articles