NewsWaves.news

ఆంధ్రాబ్యాంక్ కు 3 వేల కోట్ల కేంద్ర సాయం

ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం అందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రా బ్యాంకుకు 3256 కోట్లను అందించనుంది. ఆంధ్రా బ్యాంకుతో పాటు మరో 11 బ్యాంకులకు కేంద్రం 48,239 కోట్ల రూపాయలను మూలధన సాయంగా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం కింద కేంద్రం 1.06 లక్షల కోట్ల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించింది.

తాజాగా ప్రకటించిన కేంద్ర నిధులతో కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో అందజేసిన మొత్తం మూలధన సాయం రూ.1,00,958 కోట్లకు చేరింది. అంటే మరో రూ.5000 కోట్ల వరకు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా, విజయా బ్యాంకుల విలీన ప్రక్రియ సమయంలో ఏమైనా నిధులు అత్యవసరమైతే వాడేందుకు పక్కన పెడతామని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

Related Articles