NewsWaves.news

పారువేట ఉత్సావాల‌కు హ‌జ‌రైన గ‌వ‌ర్న‌ర్‌

తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఈ రోజు అహోబిలం న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క వ‌ర్గం రుద్ర‌వరం మండలానికి పారువేట ఉత్స‌వాల్లో భాగంగా ఈ రోజు న‌ర‌సింహ స్వామి చేరుకున్నారు. ఈ వేడుక‌కు విచ్చేసిన గ‌వ‌ర్న‌ర్‌కు స‌త్య‌నారాయ‌ణ స్వామి దేవాల‌యం వ‌ద్ద అధికారులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్, స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. త‌ర్వాత మొక్క‌లు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్టు గవర్నర్ నరసింహన్ తెలిపారు.

Related Articles