NewsWaves.news

గోంగూర పొడి

గోంగూర‌లో ఉన్న పోష‌కాలు అన్నీ ఇన్నీ కావు. అందుకూ తెలుగు వాళ్లు రెగ్యుల‌ర్‌గో గోంగూరతో చేసిన వివిధ వంట‌కాలు ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇలా ర‌క‌ర‌కాల గోంగూర వంట‌లు ట్రై చేసి బోర్ కొడితే ఈ సారిగోంగూర పొడి ట్రైయండి. మ‌రి ఎలా త‌యారుచేయాలో, ఏం కావాలో తెలుసుకోవాలంటే.. చ‌దివేయండి.

కావలసిన పదార్దములు:

  • గోంగూర కట్టలు – నాలుగు
  • ఎండు మిర్చి – పది
  • వెల్లుల్లి రేబ్బలు – ఐదు
  • సెనగ పప్పు – పావు కప్పు
  • ధనియాలు – రెండు టేబుల్ స్పూన్స్
  • జీలకర్ర – ఒక టీ స్పూన్
  • చింత పండు – కొద్దిగా
  • ఉప్పు – తగినంత
  • నూనె మూడు – టేబుల్ స్పూన్స్

తయారుచేసే విధానం

1) ముందుగా గోంగూర కడిగి ఆరబెట్టాలి. ఇది తడి మొత్తం ఆరిపోయి పొడిపొడిగా అయ్యేంత వరకు ఆరనివ్విడి. స్టవ్ పై పాన్ పెట్టు కొని నూనె వేసి వేడి చెయ్యాలి.

2) దీనిలో పచ్చిశెనగ పప్పు, ధనియాలు, జీలకర్ర, వేసి దోరగా వేపాలి.తరువాత అదే నూనెలో చింతపండు, ఎండుమిర్చి వేసి వేయించాలి.

3) ఇప్పుడు అదే పాన్ లో ఆరబెట్టిన గోంగూర వేసి పొడి పొడి గా అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు మిక్స్ జార్ తీసుకొని దానిలో ముందుగా వేయించిన శెనగపప్పు ధనియాలు వేసి మిక్సి చెయ్యాలి. తరువాత వేయించిన ఎండుమిర్చి చినత పండు వేసి మిక్సి చెయ్యాలి.

4) తరువాత దీనిలో వేయించిన గోంగూర ఉప్పు వెల్లులి వేసి మళ్ళి మిక్సి చెయ్యాలి. ఇప్పుడు గోంగూర పొడి రెడి అయ్యినట్లే . దీనిని ఒక గిన్నెలోకి తీసుకొవాలి.

5) అన్నం లోఈ గోంగూర పొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకుంటే చాల రుచిగా ఉంటుంది. మీరు తయారుచేసుకొని మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చెయ్యండి.

Related Articles