NewsWaves.news

ఐసీసీ టోర్నీల నుండి పాకిస్తాన్ ను తప్పించడం చాలా పెద్ద విషయం… గంగూలీ

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నీల నుంచి పాకిస్తాన్ ను నిషేధించడం చాలా కష్టమని, అది చాలా పెద్ద విషయమని అన్నారు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. వరల్డ్ కప్ నుండి లేదా అంతర్జాతీయ క్రికెట్ నుండి పాకిస్తాన్ ని నిషేధించడం అనుకున్నంత సులభమైన విషయం కాదని గంగూలీ అన్నారు.

ఐసీసీ ఒక ప్రత్యేకమైన క్రికెట్ మండలి అని, అది నిర్వహించే వరల్డ్ కప్ మరింత ప్రత్యేకమైనదని, అలాంటిది ఇండియన్ గవర్నమెంట్ కానీ, బీసీసీఐ కానీ పాకిస్తాన్ ను నిషేధించాలని ఒకవేళ కోరినప్పటికీ పెద్దగా ఫలితం ఉండదని ఆయన అన్నారు. అందువల్లే పాకిస్తాన్ వారితో మ్యాచ్ లు ఆడకుండా ఉండడమే మంచి నిర్ణయమని, ఎందుకంటే అది కేవలం ఇండియా, పాకిస్తాన్ టీం లకు సంబంధించిన సమస్య మాత్రమే అని గంగూలీ తెలిపారు.

ఇప్పటికే వారితో ద్వైపాక్షిక సిరీస్ లను ఆడటం లేదని మరోసారి గంగూలి స్పష్టం చేశారు. ఇండియాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆటగాళ్లకి ఇండియన్ గవర్నమెంట్ వీసాలు నిరాకరించడంతో అది గొడవగా మారిందని, ఆ విషయంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు సౌరవ్ గంగూలీ. ఒక దేశాన్ని వరల్డ్ కప్ నుంచి రద్దు చేయడం సాధ్యమయ్యే విషయం కాదు అనేది తన అభిప్రాయమని గంగూలీ అన్నారు.

Related Articles