NewsWaves.news

ఈవీఎంలు దుర్వినియోగం అవుతాయని ఎప్పటినుండో చెబుతున్నా….

అన్ని దేశాల్లో బ్యాలెట్ పద్ధతి ఉపయోగిస్తుంటే మన దేశంలో మాత్రం ఈవీఎంలను ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతాయని,బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని తాను ఎప్పటినుండో తెలియజేస్తున్నానని, కానీ ఎవరూ వినలేదని ఆయన అన్నారు. రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం పై స్పందించిన ఆయన…

ఈవీఎంల వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇప్పటికైనా గుర్తించాలని, ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వెయ్యాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు.రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది వెళ్లిన చోట కూడా ఈవీఎంలు పనిచేయకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి