NewsWaves.news

అక్షయ్ కుమార్ పేరుతో మోసం..

పుల్వామా ఉగ్ర‌దాడి త‌రువాత దేశం మొత్తం విషాదంలో మునిగిపోతే.. కొంత మంది మాతం.. ఆ విషాదాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అమ‌రుల కుటుంబాల‌ను ఆదుకోవ‌డం కోసం ఎన్నో వెబ్‌సైట్లు, ఆప్స్ ప్ర‌జ‌ల నుంచి ఆర్థిక స‌హాయాన్ని తీసుకుంటున్నాయి. ఇదే అవ‌కాశం అనుకున్న ఒక మోస‌గాడు అక్ష‌య్‌కుమార్ లాంచ్ చేసిన భార‌త్‌కే వీర్ అనే వెబ్‌సైట్ కాపీ కొట్టి ఒక కొత్త సైట్ ను సృష్టించాడు. వీర జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం చేయ‌డానికి అంటూ డ‌బ్బు వ‌సూలు చేయ‌డం మొద‌లు పెట్టాడు.

‘Army Welfare Fund Battle Casualties అనే ఈ వెబ్‌సైట్‌ను అక్ష‌య్ కుమార్ ప్రారంభించాడ‌ని నమ్మిస్తూ ఎంతో మందిని మోసం చేసి విరాళాలు సేక‌రిస్తున్నాడు. ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్స్‌కు దానం చేయ‌డం వ‌ల్ల ఎంతో మంది మోసపోతున్నారు. అందుకే మీరు విరాళం అందించాలి అనుకుంటే మాత్రం ఆ వెబ్‌సైట్, లేదా యాప్ పై న‌మ్మ‌కం కుదిరితేనే ముందుకు వెళ్లండి. లేదా ప్ర‌త్యామ్నాయ మార్గంలో మీ స‌హాయం అమ‌రుల కుటుంబాల‌కు అందేలా చూడండి.

Related Articles