NewsWaves.news

మాజీ ఎంపీ రితీష్ మరణం…

సినీ నటుడు,మాజీ ఎంపీ జే కే రితీష్ హఠాత్తుగా కన్నుమూశారు. 46 సంవత్సరాలు ఉన్న రితీష్ గుండెపోటుతో మరణించారు. రామనాథపురం లో ఉన్న ఆయన ఆయన స్వగృహంలో గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. అయితే ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఆయన మరణించడం జరిగింది. ఆయన నాలుగు తమిళ సినిమాలలో హీరోగా చేశారు. డీఎంకే పార్టీ తరఫున 2009 లోక్ సభ ఎన్నికలలో రామనాథపురం నుండి ఎంపీగా పని చేసిన ఆయన తర్వాత అన్నాడీఎంకే లో చేరడం జరిగింది. రితీష్ కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. అభిమానుల సందర్శన కోసం పార్థివ దేహాన్ని ఆయన స్వగృహంలోనే ఉంచారు. కాగా ఆయన అంత్యక్రియలు నేడు రామనాడులో జరగనున్నాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి