NewsWaves.news

ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్ మృతి… సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్…

ప్రముఖ చిత్రకారుడు సూర్య ప్రకాష్‌(78) నేడు మృతి చెందారు.ఆయన మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన చిత్రకారుడిగా సూర్యప్రకాష్‌ చరిత్రలో నిలిచిపోతారని కెసిఆర్ అన్నారు.

సూర్య ప్రకాష్ స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర. చాలా కాలంగా ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ప్రారంభంలో ఆయన సీసీఎంబీకి రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేసారు.ఇప్పుడు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా చేస్తున్నారు.1961- 1964 వరకు సూర్య ప్రకాష్ ఏపీ సమాచార శాఖలో ఉద్యోగం చేశారు.కాగా సూర్యప్రకాష్ మృతిపట్ల ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి