NewsWaves.news

మాఘం…అమోఘం.. మాఘ పౌర్ణమి…మహత్తరం

మాఘ పౌర్ణమి నాడు నదీ జలాలు, సముద్రాలు, చెరువులలో పవిత్ర స్నానమాచరిస్తే  పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. మాఘ మాస స్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆయుర్దాయంతో పాటు ఆరోగ్యం, మంచితనం, ఉత్తమ గుణాలు వృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మాఘమాసంలో శుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశిలలో నదీ జలాల్లో పవిత్ర స్నానమాచరిస్తే  కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

  ఈరోజున చేసే స్నాన, దాన, జప, హోమ, తర్పణాదుల వల్ల  అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా దానాల వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో మాఘమాసంలో పూజలు, దానధర్మాలు చేసి, వీలైనంత ఎక్కువ సమయం దైవధ్యానంలో, ఆధ్యాత్మిక చింతనతో గడపాలి. 

సూర్యకిరణాలలో  కొన్ని రకాల రుగ్మతలను నివారించగల శక్తి ఉండటంతో ఆ కిరణాలు తాకిన నదులు, బావులు, చెరువులు మొదలైన జలాలకు కూడా ఆ శక్తి లభిస్తుంది. అందువల్ల మాఘమాసంలో వచ్చే ముఖ్య తిథుల్లో నదుల్లో స్నానమాచరించడం ఉత్తమ ఫలితాలనిస్తుందని పండితులు,  పురోహితులు సూచిస్తున్నారు. ఈరోజు లక్ష్మీనారాయణులను, ఉమా మహేశ్వరులను, దత్తాత్రేయస్వామిని ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి.   

    శ్లోకం…జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్

            సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహం భజే ii   

Related Articles