NewsWaves.news

ఆర్టిక‌ల్ 35- ఎ అంటే ?

దేశ‌వ్యాప్తంగా ఆర్టిక‌ల్‌ 35-ఎ గురించి ఇప్పుడు బాగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పుల్వామాలో అవంతిపొరాలో సీఆర్ఫీపీఫ్ జ‌వాన్ల‌పై జ‌రిగిన ఉగ్ర‌దాడి త‌ర్వాత క‌శ్మీర్‌లో నెల‌కొన్న ఆశాంతి త‌ర్వాత‌.. ఇప్పుడు ఈ ఆర్టిక‌ల్ 35-ఎపై సుప్రీం కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌డం ప‌రిస్థితిని మ‌రింత సున్నితంగా మారింది. ఈ ఆర్టిక‌ల్ జ‌మ్మూ- క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌కు కొన్ని ప్ర‌త్యేక హక్కులు, అధికారాల‌ను ఇస్తుంది. ఈ ఆర్టిక‌ల్‌ను ర‌ద్దు చేయండి అంటూ పిటీష‌న్లు రావ‌డం.. సుప్రీం కోర్టు విచార‌

ఈ ఆర్టిక‌ల్ ప్ర‌కారం

  • 1954 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. స్థానికేతరులు ఇక్కడ స్థిరాస్తులను కలిగి ఉండటం, కొనుగోలు చేయడం కుదరదు.
  • పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఆర్టికల్ 35ఎపై విచారణకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
    *మరోవైపు, ఆర్టికల్ 35ఎపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోడానికి తమకు అనుమతి ఇవ్వాలని, ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వం లేదు కాబట్టి విచారణను వాయిదా వేయాలని ఇటీవలే జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
  • ఫిబ్రవరి 11న జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది షోయబ్ ఆలమ్, వచ్చే విచారణ వాయిదా వేయాలని అభ్యర్థించారు.
    *ఈ ఆర్టికల్‌ ద్వారా రాష్ట్రంలో ఎవరు శాశ్వతపౌరులన్నది జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ నిర్ణయిస్తుంది.
  • రాష్ట్రానికి చెందిన మహిళ ఇతర రాష్ట్రాల వారిని వివాహం చేసుకుంటే వారికి రాష్ట్రంలో ఆస్తిహక్కు ఉండదు.
  • రాష్ట్రంలో శాశ్వత నివాస హక్కును వారి పిల్లలకు జారీచేయరు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు ఆర్టికల్‌ 35ఎ విరుద్ధంగా ఉండటంపై మానవహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles