NewsWaves.news

ఎఫ్‌2 తెలుగు రివ్యూ

న‌టీన‌టులు : వెంక‌టేష్, త‌మ‌న్నా, వ‌రుణ్‌, మెహ్రీన్‌
దర్శ‌క‌త్వం : అనిల్ రావిపూడి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత : దిల్ రాజు
విడుదల తేది : 12 జ‌న‌వ‌రి 2019

ఈ సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో కంప్లీట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఢోసుతో వ‌చ్చే సినిమా ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఎంట్‌టైన్‌మెంట్ ఉండే సినిమా ఇద‌ని వెంక‌టేష్‌ ప్ర‌తీ ఇంట‌ర్వ్యూలో చెబుతూనే ఉన్నాడు. అయితే వెంకి చెప్పినట్టే ఈ సినిమా ఉందో లేదో ఈ రివ్యూ చదివితే మీకే అర్థం అవుతుంది.

క‌థ‌:
హారికా ( త‌మ‌న్నా), హ‌నీ (మెహ్రీన్‌)కు ఇద్ద‌రు బాగా యాటిట్యూడ్ ఉన్న అక్కా చెల్లెల్లు. ఒక ఎమ్మెల్యేకు పీఏగా ప‌ని చేస్తున్న వెంక‌టేష్ హారిక‌ను పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తుంది. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని ఒక బ‌స్తీలో ఉండే వ‌రుణ్ యాద‌వ్ (వ‌రుణ్ తేజ్)కు హ‌నీతో పెళ్లి జ‌రుగుతుంది. అయితే పెళ్లి త‌ర్వాత వాళ్ల జీవితం కామెడీ అయిపోతుంది. ఇంట్లో మొత్తం ఆడ‌పెత్తనం. వెంకీ మాట అస్స‌లు న‌డ‌వ‌దు. దీంతో వ‌రుణ్‌ను ఇంటికి అల్లుడిగా రావ‌ద్దు అని చెప్ప‌డానికి వెంకీ ఎంత ట్రై చేసినా విన‌డు. చివ‌రికి వెంకీతో పాటు అత‌ను కూడా బాధితుడిగా మార‌తాడు. అయితే ప‌క్కింట్లో ఉండే ఒక వ్యక్తి ( రాజేంద్ర ప్ర‌సాద్) స‌ల‌హాతో యూరోప్లో ఉన్న ప్ర‌కాష్ రాజ్ ఇంటికి వెళ్తారు వెంకీ, వ‌రుణ్. ఇది తెలుసుకున్న హారికా, హ‌నీ కూడా వెంట‌నే యూరోప్‌కు వెళ్తారు. అక్క‌డ ఏం జ‌రుగుతుంది. ఎంత ఫ‌న్ .. ఎంత ఫ్ర‌స్ట్రేష‌న్ ఉంటుంది. వాళ్ల బంధాలు నిలుస్తాయా.. లేక బ్రేక‌ప్ అవుతారా.. అనేదే సినిమా స్టోరీ.

న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్ :
నువ్వు నాకు నచ్చావ్‌, మ‌ళ్లీశ్వ‌రీ, ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే త‌ర్వాత వెంకీ సినిమాలో ఫ‌న్ కోసం వెతుకుతున్న ప్రేక్ష‌కులకు ఆ లోటు ఈ మూవీతో భ‌ర్తీ అవుతుంది. ఈ మూవీలో వెంకి కామెడీ టైమింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. వ‌రుణ్ తేజ్ తెలంగాణ యాస‌లో ఇంప్రెస్ చేస్తాడు. త‌మ‌న్నా, మెహ్రీన్ న‌ట‌న బాగుంది. మిగితా న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌కు మంచి మార్కులే వేయ‌వ‌చ్చు.

పాజిటివ్స్ :
మంచి కామెడీతో కూడుకున్న ఫ‌స్ట్ హాఫ్‌
వెంకి బ్రాండ్ కామెడీ, యాక్టింగ్‌

నెగెటివ్స్‌
క్లైమాక్స్‌, సెకండ్ హాఫ్‌ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం

Related Articles