NewsWaves.news

టీఆర్ఎస్ వచ్చినా కలిసి పనిచేస్తా… చంద్రబాబు

యూపీఏ సమావేశానికి కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌కు ఆహ్వానం అందినట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఏ పార్టీవారు కలిసివచ్చినా కూడా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.నేడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చంద్రబాబు సమావేశం అయ్యారు.తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఈ మీడియా సమావేశంలో భాగంగా ఒక విలేకరి నుండి..కాంగ్రెస్‌ వారు టీఆర్ఎస్‌కు పిలుపునందించారని వార్తలు వినిపిస్తున్నాయని,

ఒకవేళ ఈ క్రమంలో హస్తం పార్టీతో కలిసి టీఆర్ఎస్ వచ్చినా కూడా పనిచేస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా…ఎవరు కలిసి వచ్చినా పని చేస్తామని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం. అంతే కాదు మరీ హైపోథిటికల్‌ ప్రశ్నలను అడగాల్సిన అవసరం లేదు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీవారు వచ్చినా కూడా వారితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని,తమకు ఏ పార్టీపైనా వివక్ష ఉండవలసిన అవసరం లేదు అని చంద్రబాబు తెలిపారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి