NewsWaves.news

ఊరంతా క‌రెంట్‌ షాక్‌…. ఒక‌రి మృతి

విద్యుత్ అధికారులు నిర్ల‌క్ష్యానికి ఒక ఊరు మొత్తం వణికిపోయింది. ఎన్ని సార్లు మొర‌పెట్టుకున్నా ప‌ట్టించుకోని విద్యుత్ అధికారుల వ‌ల్ల వికారాబాద్‌లోని బ‌షీరాబాద్ మండలం కంస‌న్ ప‌ల్లి బి గ్రామం మొత్తం క‌రెంట్ షాక్‌కు గురైంది. దీంతో ఆ గ్రామానికి చెందిన ఒక వ్య‌క్తి విద్యుదాఘాతానికి గురై మ‌ర‌ణించ‌గా..మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌పడ్డారు. గాయ‌ప‌డిన వారిని వెంట‌నే హైద‌రాబాద్‌లోని ఒక అసుప‌త్రికి త‌రలించారు. అయితే ఈ క‌రెంట్ షాక్‌తో గ్రామంలో ఉన్న ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌న్నీ కాలిపోయాయి. ఈ విష‌యంపై ఎన్ని సార్లు స్థానిక అధికారుల‌కు మొర‌పెట్టుకున్నా.. ప‌ట్టించుకోలేద‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

Related Articles