NewsWaves.news

ప్ర‌చారానికి తెర‌..

ఉభ‌య త‌లుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నేటితో ముగిసింది. మైకులు మూగ‌బోయాయి. వేసవి ఎండలలో అధినేత‌లు, పార్టీల నాయ‌కులు, అభ్య‌ర్ధులు త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి దాదాపు 24 రోజుల‌పాటు అవిశ్రాంతంగా హోరాహోరీ ప్ర‌చారం చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 25 లోక్‌సభ స్థానాల‌కు, 175 అసెంబ్లీ స్థానాల‌కు, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ స‌భ‌ స్థానాల‌కు ఈనెల 11వ తేదీన ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి. ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది.

ప్రచార కోలాహలం సద్దుమణిగడంతో పార్టీలన్నీ గురువారం జరగనున్న పోలింగ్ స‌ర‌ళిపై దృష్టి సారించాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మ‌రోవైపు ఎన్నిక‌ల అధికారులు, పోలీసు అధికారులు పోలింగ్ శాంతియుతంగా జ‌రిగేందుకు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి